మళ్లీ మేకప్​ వేసుకొనేందుకు రెడీ అయిన పూజా హెగ్డే

మళ్లీ మేకప్​ వేసుకొనేందుకు రెడీ అయిన పూజా హెగ్డే
  • కాలికి గాయంతో ఇంతకాలం సెట్స్​కు దూరం 

సల్మాన్​ మూవీ షూటింగ్​ లో కాలికి గాయం కావడం, బ్రదర్​ మ్యారేజ్​ సెలబ్రేషన్స్​ లో బిజీగా ఉండటంతో గత కొంతకాలంగా షూటింగ్​ కు దూరంగా ఉన్న బుట్టబొమ్మ పూజా హెగ్డే... మళ్లీ మేకప్​ వేసుకొనేందుకు రెడీ అయ్యింది.  రీసెంట్​ గా జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తున్న ఫొటోలు, షూటింగ్​ సెట్​ లో హెయిర్ స్టైలిష్ చేసుకుంటున్న ఫొటోలను షేర్​ చేసింది. ఈ ఫోటో ద్వారా బ్యాక్ టూ షూటింగ్ అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో పూజ హీరోయిన్​ గా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ జనవరిలో మొదలైంది. ఈ మూవీలో పూజా హెగ్డేతో పాటు యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా హీరోయిన్స్ నటిస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్​.. పూజా కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాలు భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాల్లో పూజాకు కూడా మంచి క్యారెక్టర్లు దొరికాయి. తాజాగా మహేశ్​ సినిమాలోనూ పూజకు మంచి రోల్​ ఉంటుందన్న టాక్​ వినిపిస్తోంది