ప్రేరణ.. ఆన్ సెట్స్

ప్రేరణ.. ఆన్ సెట్స్

తెలుగు, తమిళం, హిందీ అంటూ అన్ని భాషల్లోనూ చక్రం తిప్పుతోంది పూజా హెగ్డే. అయితే  సెకెండ్ వేవ్ వల్ల షూటింగులన్నీ క్యాన్సిల్ అవడం, పూజకి కూడా కోవిడ్ రావడంతో చాలా రోజులుగా రెస్ట్‌‌లోనే ఉందామె. రీసెంట్‌‌గా అన్‌‌లాక్‌‌ ప్రకటించడంతో పని చేయడానికి హుషారుగా రెడీ అయ్యింది. నిన్న ‘రాధేశ్యామ్’ షూట్‌‌లో జాయినయ్యింది. ఆ విషయాన్ని తనే సోషల్‌‌ మీడియాలో చెప్పింది. నిజానికి లాక్‌‌డౌన్‌‌ పెట్టకపోతే ఈ సినిమా చాలా రోజుల క్రితమే పూర్తయిపోయేది. ఎందుకంటే ఇంకా కొంత పార్ట్‌‌ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ షెడ్యూల్‌‌లో దాన్ని పూర్తి చేయబోతున్నారు. ఈ మూవీ కోసం వంద కోట్లు పెట్టి ఇరవై ఆరు సెట్స్‌‌ వేశారని టాక్. ఇప్పుడు వాటిలోనే మిగిలిన ఉన్న సీన్స్‌‌ని తీస్తున్నాడట డైరెక్టర్ రాధాకృష్ణ. ఇదో వింటేజ్ లవ్‌‌స్టోరీ. విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజ కనిపించబోతున్నారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ ప్యాన్ ఇండియా రేంజ్‌‌లో నిర్మిస్తోంది. పూజ చేతిలో మరో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. అఖిల్‌‌తో కలిసి నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రిలీజ్‌‌కి రెడీ అవుతోంది. రామ్‌‌చరణ్‌‌కి జోడీగా యాక్ట్ చేసిన ‘ఆచార్య’ త్వరలో కంప్లీట్ కాబోతోంది. హిందీలో భాయిజాన్‌‌, సర్కస్‌‌ చిత్రాలతో పాటు తమిళంలో విజయ్‌‌తో కలిసి ‘బీస్ట్’ కూడా చేస్తోంది.