
టాలీవుడ్ బుట్టబొమ్మకు బంపర్ ఆఫర్ వచ్చింది. వరుసగా ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఈ అమ్మడుకు అదిరిపోయే ఛాన్స్ వచ్చింది. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ జోడిగా పూజా హెగ్డే నటించనుంది.
పూజా హెగ్దేను వరుస ఫ్లాపులు వెంటాడుతున్నాయి. ప్రభాస్ తో చేసిన రాధేశ్యాం, చిరంజీవి, రామ్ చరణ్తో నటించిన ఆచార్య, విజయ్ తో నటించిన బీస్ట్ వంటి సినిమాలు బాక్సాఫీజు వద్ద బోల్తా కొట్టాయి. ఈ సినిమాలు నెగిటివ్ టాక్ తెచ్చినా...గొపికమ్మకు ఆఫర్లు మాత్రం ఆగడం లేదు. ఇటీవలే సల్మాన్‌తో బాలీవుడ్ ఆఫర్ కొట్టేసింది. ఈ మూవీ కూడా ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో పూజా హెగ్డే పని అయిపోయింది అనుకున్నారంతా.. కానీ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఈ బ్యూటీ ఖాతాలో మరో సినిమా వచ్చి చేరింది.
షాహిద్ కపూర్సరసన నటించబోతుంది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌తో బాలీవుడ్లో షాహిద్ కపూర్ కు మంచి మార్కెట్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో షాహిద్మూవీతో అయినా.. పూజా హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. షాహిద్ కపూర్ తో నటించే సినిమాకు మళయాల దర్శకుడు రోషన్ ఆండ్రూస్దర్వకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం మహేశ్ బాబు 28వ సినిమాలో పూజా హెగ్డే నటిస్తోంది.