
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు, లైంగిక వేధింపులు వంటివి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇటీవలే కొరియోగ్రాఫర్ జానీ లైంగిక వేధింపుల విషయంలో మధ్య ప్రదేశ్ కి చెందిన మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించి పిర్యాదు చేసింది.
దీంతో పలువురు సినీ సెలెబ్రెటీలు భాదితురాలికి అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో మరింతమంది క్యాస్టింగ్ కౌచ్ భాదితులు ధైర్యంగా ముందుకొచ్చి తాము ఎదుర్కున్న సంఘటనల గురించి స్పందిస్తున్నారు.
ALSO READ | జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు వ్యవహారంలో బాధితురాలికి అండగా స్టార్ హీరో.
తెలుగు ప్రముఖ నటి పూనమ్ కౌర్ కూడా క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఇందులోభాగంగా తాను గతంలో ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై "మా" అసోసియేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదని పేర్కొంది.
అంతేగాకుండా తాను రాజకీయంగా కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. కావున ఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ప్రశ్నించాలని సినీ పరిశ్రమ పెద్దలను కోరింది.
నటి పూనమ్ కౌర్ ట్వీట్ తో త్రివిక్రమ్ వ్యవహారం టాలీవుడ్ సినీపరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో త్రివిక్రమ్ విషయంలో సినీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై ఆసక్తి నెలకొంది.
Had maa association taken complaint on trivikram Srinivas ,
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 17, 2024
I and many wouldn’t have had the political suffering , I was rather silently ignored , I had given a call tand then complaint to the heads , I want industry big wigs to question Director Trivikram .