
మాజీ ప్రధాని.. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పీవీ నరసింహారావు 19 వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొ చ్చిన ఘనత స్వర్గీయ పీవీ నరసింహారావుకే దక్కుతుందన్నారు.
పేదలకు భూములు పంచడానికి ఆయన బలమైన పునాదులు వేశారంటూ.. . పీవీ మన మధ్య భౌతికంగా లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయమని, పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్‌లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారని పేర్కొన్నారు. దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి, పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ అని కొనియాడారు...