రివ్యూ: పాప్ కార్న్

రివ్యూ: పాప్ కార్న్

సాయిరోనక్, అవికా గోర్ నటించిన లేటెస్ట్ మూవీ పాప్ కార్న్. మురళీ గంధం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సాంగ్ ను నాగచైతన్యతో, ట్రైలర్ ను నాగార్జునతో లాంచ్ చేసి.. రిలీజ్ కి ముందే మేకర్స్ భారీ హైప్ క్రియేట్ చేశారు. భారీ అంచనాల మధ్య ఇవాళ థియేటర్లకు వచ్చిన ఈ లో బడ్జెట్ సినిమా  ప్రేక్షకుల్ని ఆకట్టుకోగల్గిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

 పాప్ కార్న్. థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకుల్లో సినిమా చూస్తూ పాప్ కార్న్ తినేవాళ్లు 90శాతానికి పైనే ఉంటారు. అలాంటిది పాప్ కార్న్ పేరుతోనే ఒక సినిమా వస్తే... అందులో చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్ గా చేస్తే.. ఆ సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయే ఊహించుకోవచ్చు. పైగా ఫస్ట్ టైమ్ అవికా గోర్ హోమ్ బ్యానర్ అయిన అవికా స్క్రీన్ క్రియేషన్స్ పై ఈ సినిమాని తీశారు. అలాంటి సినిమాపై మేకర్స్ తో పాటు ప్రేక్షకులు అంచనాలు పెట్టుకోవడం సర్వసాధారణమే. 

అలాంటి అంచనాలతో థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకుడితో పాటు.. ఎలాంటి అంచనాలు లేకుండా మూవీని ఎంజాయ్ చేద్దామని వెళ్లిన కామన్ మ్యాన్ పరిస్థితి తల బద్దలు అవ్వాల్సిందే. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు కథ ఎక్కడుందో కూడా అర్థం కానిపరిస్థితి సగటు ప్రేక్షుకుడిది. థియేటర్ లోకి హ్యాపీగా వెళ్లిన ఆడియన్స్ కి పది నిమిషాలు అవ్వకముందే ఎందుకు వచ్చామురా అనే ఫీల్ స్టార్ట్ అవుతుంది. ఎలాగూ వచ్చాం కదా అని బలవంతంగా మూవీని చూస్తే.. ఇంటర్వెల్ రాకముందే హెడేక్ స్టార్ట్ అవుతుంది. ఎవరైన సినిమా మొత్తం చూస్తే వాళ్ల ధైర్యానికి, ఓపికకు మొక్కాల్సిందే.

ఈ సినిమా మొత్తంలో ఏదైనా ప్లస్ ఉంది అంటే అది శ్రీజో అందించిన లిరిక్స్ మాత్రమే. శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ బానే ఉందనుకున్నా... అక్కడక్కడా టార్చర్ అనుభవించాల్సిందే. ఇక లీడ్ రోల్ లో చేసిన సాయిరోనక్, అవికా లు తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పాలో... లేదా ప్రేక్షకులకి విసుగు తెప్పించారనాలో కూడా అర్థంకాని పరిస్థితి. ఈ సినిమాలో ఎలాంటి కథ లేదుకాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడుకోవడం కూడా టైమ్ వేస్ట్. కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు మూవీని డైరెక్ట్ చేసిన మురళీ గంధం.. ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నాడో తెలీదు. ఈ సినిమాని థియేటర్ లోనే కాదు.. ఓటీటీ ఫ్లాట్ పామ్ మీద కూడా చూడలేము. 

ఈ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే... ఇది పాడైపోయిన పాప్ కార్న్.