
క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ వీక్లీ సందర్శకుల మీట్‌లో నవ్వులు పూయించారు. తనను ముద్దు పెట్టుకోవాలని ఓ నన్ (సన్యాసిని) కోరడంతో దానికి ఆయన ఇచ్చిన సమాధానం హాల్‌లో ఒక్కసారిగా అందరూ నవ్వారు. అందరూ కామ్‌గా ఉండాలని చెప్పిన పోప్ చివరికి ఆమె బుగ్గపై ముద్దు పెట్టి ముందుకు సాగారు. అసలు ఆ సన్యాసిని.. ఏం అడిగింది.. దాని పోప్ ఇచ్చిన సమాధానమేంటో చూద్దాం.
వాటికన్ సిటీలో ప్రతి వారం పోప్ సందర్శకులను కలుస్తారు. ఇలా బుధవారం కూడా వందల మంది పోప్ ప్రాన్సిస్‌నుకలిసి దీవెనలు అందుకోవాలని వచ్చారు. ఆయన కోసం హాల్ నిండా జనాలు ఎదురు చూస్తున్నారు. ఆ జనాల్లో ముందు వరుసలో నిల్చుని ఉన్న ఓ నన్.. పోప్ రాకతో ఎంతో ఉత్సాహంగా ఇటాలియన్ భాషలో తనకు ముద్దు పెట్టండి పోప్.. (బాసియో పాపా) అని అరిచింది. ఆమె కేకతో వేదికపైకి వెళ్తున్న పోప్ ఆగి.. ‘సరే.. కానీ నువ్వు కొరుకుతావేమో’ అనడంతో హాల్ అంతా ఒక్కసారి నవ్వులు పూశాయి. దీంతో అందరినీ కామ్‌గా ఉండాలని కోరిన ఆయన ఆమె దగ్గరకు వెళ్లి.. ‘సరే, నేను ముద్ద పెడతా.. కానీ నువ్వు కామ్‌గా ఉండాలి. కొరకకూడదు’ అన్నారు. దానికి ఆమె ఓకే అనడంతో పోప్ ఆ నన్‌కు బుగ్గపై ముద్దు పెట్టారు.
పోప్ తను అడిగినట్లుగా ముద్దు పెట్టడడంతో ఆ నన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రపంచంలోని క్రైస్తవులందరికీ ఆరాధ్య దైవం లాంటి పోప్ తనను ముద్దాడడంతో థ్యాంక్యూ పోప్ (గ్రాజియే పాపా) అంటూ ఎగిరి గంతేసింది.
గత వారం న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రజలను దీవిస్తూ వెళ్తున్న పోప్ ఫ్రాన్సిస్‌ను ఒక్కసారిగా ఓ మహిళ చేయిపట్టుకుని లాగింది. అప్పుడు ఆయన తన చేయి విడిపించుకునే ప్రయత్నం చేసినా వదలలేదు. దీంతో ఆయన కోపంగా ఆమె చేతిని కొట్టి.. విడిపించుకోవాల్సి వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోప్ ఆ మహిళకు క్షమాపణ చెప్పారు కూడా. ఆ అనుభవాన్ని గుర్తు పెట్టుకుని పోప్ బుధవారం సందర్శకుల మీట్‌లో ఈ తరహా కామెంట్స్ చేశారు.