యూకేతో ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్.. ఏఏ రంగాలకు లాభమంటే..?

యూకేతో ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్.. ఏఏ రంగాలకు లాభమంటే..?

India-UK FTA: మోదీ పర్యటనలో భాగంగా యూకేతో భారత్ చారిత్రాత్మకమైన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. దాదాపు మూడేళ్ల చర్చల తర్వాత ప్రస్తుత వాణిజ్య ఒప్పందం ఫైనల్ అయ్యింది. దీనికి భారత చట్టసభలతో పాటు బ్రిటన్ పార్లమెంటులో ఆమోదం తర్వాత అమలులోకి రానున్నాయి.

భారత్ అందిస్తున్న తగ్గింపులు.

  1. భారతదేశం యూకే నుంచి దిగుమతి చేసుకునే స్కాచ్ విస్కీపై ఉన్న 150 శాతం సుంకాన్ని 75 శాతానికి తగ్గించనుంది. తర్వాతి 10 ఏళ్లలో ఈ పన్నును 40 శాతానికి తగ్గించాలని ఇరు దేశాలు అంగీకరించాయి

  2.  యూకేలో తయారైన వాహనాలపై ప్రస్తుతం ఉన్న 100 శాతానికి పైగా సుంకాన్ని కోటా విధానంలో 10 శాతానికి తగ్గింపు.

  3. ఇక యూకే నుంచి వచ్చే కాస్మెటిక్స్, మెడికల్ పరికరాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, సాల్మన్ చేపలపై పన్నులను తగ్గించనున్నట్లు ఇండియా ప్రకటించింది.

యూకే అందిస్తున్న తగ్గింపులు..
డీల్‌లో భాగంగా యూకే భారతదేశం నుంచి తమ దేశంలోకి ఎగుమతయ్యే 99 శాతం వస్తువులను ఎలాంటి సుంకాలు లేకుండా అనుమతించాలని నిర్ణయించింది.

ఇండియాలో లాభపడే రంగాలు కంపెనీలు ఇవే.. 
టెక్స్‌టైల్ అండ్ అపెరల్- వెల్‌స్పన్, అరవింద్
ఫుట్ వేర్- బాటా ఇండియా, రిలాక్సో
ఆటో కాంపొనెన్ట్స్ అండ్ ఈవీ- టాటా మోటార్స్, మహీంద్రా ఎలక్ట్రిక్
ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్టరింగ్- భారత్ ఫోర్జ్
రత్నాలు, జ్యువెలరీ, స్పోర్ట్స్ పరికరాలు, ఫర్నిచర్, కెమికల్స్, మెషినరీ

 

  • భారతీయ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వాహన తయారీదారులు కూడా కొత్త కోటా ఆధారిత విధానం కింద ప్రాధాన్యతలు పొందుతారు.
  • కొత్త ట్రేడ్ అగ్రిమెంట్ కింద భారతీయ యోగా ట్రైనర్లు, చెఫ్స్, మ్యూజిషియన్స్ తక్కువ కాలానికి యూకే వెళ్లేందుకు అనుమతించబడతారు.
  • యూకేలో ఉన్న భారతీయ నిపుణులు మూడేళ్ల పాటు సామాజిక భద్రతకు ఎలాంటి మెుత్తం చెల్లించక్కర్లేదు.
  • యూకేకు చెందిన సంస్థలు ఇకపై భారతదేశంలోని నాన్ సెన్సిటివ్ ఫెడరల్ ప్రొక్యూర్మెంట్ టెండర్లకు 2 బిలియన్ రూపాయల బిడ్లలో పాల్గొనవచ్చు. 

►ALSO READ డాక్యుమెంట్లు ఎప్పుడూ మీ వెంటే ఉండాలి : అమెరికాలోని గ్రీన్ కార్డ్ హోల్డర్లకు వార్నింగ్!