భారత్‌ను సందర్శించాల్సిందిగా పోప్‪కు ఆహ్వానం: ప్రధాని మోదీ

భారత్‌ను సందర్శించాల్సిందిగా పోప్‪కు ఆహ్వానం: ప్రధాని మోదీ

G7 సమ్మిట్ సందర్భంగా ఇటలీలో పర్యటిస్తోన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. శుక్రవారం (జూన్ 14) ప్రపంచవ్యాప్త క్యాథలిక్ చర్చి అధినేత పోప్ ఫ్రాన్సిస్‌తో మాటా మంతి కలిపారు. అనంతరం ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన చిత్రాలను మోదీనే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 

87 ఏళ్ల పోప్‌ను భారత్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించినట్లు ప్రధాని తెలిపారు. "G7 సమ్మిట్ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్‌ని కలిశాను . ప్రజలకు సేవ చేయడంలో, మానవాళిని మరింత మెరుగుపరుచుకోవడంలో అతని నిబద్ధతను నేను అభినందిస్తున్నాను. అలాగే భారతదేశాన్ని సందర్శించాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు.." అని మోదీ ట్వీట్ చేశారు. G7 సమ్మిట్‌కు హాజరైన ప్రపంచ నాయకులను పలకరించడానికి పోప్ ఫ్రాన్సిస్‌ను వీల్ చైర్‌లో తీసుకొచ్చారు.

జీ7 సెషన్‌లో మోదీ ప్రసంగం

జీ7 ఔట్‌రీచ్ సెషన్‌లో తన ప్రసంగం గురించి కూడా ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. "ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎనర్జీ, ఆఫ్రికా మెడిటరేనియన్‌పై G7 ఔట్‌రీచ్ సెషన్‌లో మోదీ మాట్లాడారు. అనేక రకాల విషయాలను భారత ప్రధాని హైలైట్ చేసారు. ముఖ్యంగా, మానవ పురోగతికి సాంకేతికతను విస్తృత స్థాయిలో ఉపయోగించడం, మానవ జీవితంలోని వివిధ అంశాలలో సాంకేతిక పరిజ్ఞానం యొక్క పెరుగుదల ప్రాముఖ్యతను మోదీ పునరుద్ఘాటించారు. భారతదేశం తన అభివృద్ధి ప్రయాణం కోసం AIని ఎలా ఉపయోగించుకుంటుందో వివరించారు.