కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి

కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి
  • కొత్త పార్లమెంటుకు అంబేద్కర్ పేరుపెట్టాలని వినతి

హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. కొత్త గెటప్ లో వచ్చిన ఆయనను కొంత మంది గుర్తు పట్టలేదు. పలకరింపు విని వెంటనే గుర్తుపట్టేశారు. ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ  ఆర్గనైజేషన్ నాయకులతో కలసి ఆయన బీజేపీ ఆఫీసుకు వచ్చిన గద్దర్ బీజేపీ స్టేట్ ఛీఫ్ బండి సంజయ్ ను హగ్ చేసుకున్నారు.  కొత్తలుక్ లో కనపడ్తున్నావ్ అంటూ బండి సంజయ్ గద్దర్ తో అనగా తనదైన శైలిలో స్పందించారు. ఇరువురు కాసేపు సరదాగా నవ్వుకున్నారు. 

దేశ రాజధాని న్యూఢిల్లీలో కడుతున్న నూతన పార్లమెంట్ భవనానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని బండి సంజయ్ కు విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ పేరు పెట్టే అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలని కోరారు. ఇదే విషయంపై ఇటీవల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. అన్ని ప్రముఖ రాజకీయ, ప్రజా సంఘాల నేతలను కలసి పార్లమెంటులో చర్చకు పెట్టేలా చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు. ఈ తీర్మానం.. కార్యాచరణలో భాగంగా గద్దర్ ఇవాళ బీజేపీ ఆఫీసుకు వచ్చారు.