పోర్షే ఈ-కయేన్ @ రూ.2.28 కోట్లు

పోర్షే ఈ-కయేన్ @  రూ.2.28 కోట్లు

యూరప్​ లగ్జరీ కార్ల సంస్థ పోర్షే, తన ఎస్‌‌యూవీ 'కయేన్' ఎలక్ట్రిక్ వేరియంట్‌‌ను భారత్‌‌లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.77 కోట్లు కాగా, టాప్ వేరియంట్ టర్బో ఎలక్ట్రిక్ ధర రూ.2.28 కోట్లు. ఒకసారి చార్జ్​చేస్తే 642 కిలోమీటర్లు వెళ్తుంది.

టర్బో ఎలక్ట్రిక్ వేరియంట్ కేవలం 2.5 సెకెన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.  క్రాష్ టెస్ట్‌‌లో 5-స్టార్ రేటింగ్​, ఎంబీఎస్, మల్టిపుల్ ఎయిర్‌‌బ్యాగ్‌‌లు, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ , ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు కయేన్​ సొంతం.