
- రైతులపై పన్నుల భారం
షిమ్లా : ప్రధాని మోదీ దేశంలోని పోర్టులు, ఎయిర్ పోర్టులు, బొగ్గు గనులను తన దోస్తులైన బడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేశారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. బుధవారం కులులో నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం హిమాచల్‌లోని మెజార్టీ కోల్డ్ స్టోరేజీ యూనిట్లు అదానీ చేతిలోనే ఉన్నాయన్నారు. దీంతో యాపిల్ రేట్ల నిర్ణయం, యాపిల్ పండించే రైతుల భవిష్యత్తు అదానీ చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు.
ప్రధాని మోదీ యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే యాపిల్స్‌పై పన్ను తగ్గించి, ఇక్కడి రైతులు వాడే పనిముట్లు, పరికరాలపై జీఎస్టీ విధించారని మండిపడ్డారు. దీంతో అమెరికా నుంచి వచ్చే యాపిల్స్‌తో ఇక్కడి సాగుదారులు పోటీ పడలేకపోతున్నారని అన్నారు. కేంద్రం సర్కారు హిమాచల్‌లోని టూరిజం సహా చిన్న, మధ్య తరహా వ్యాపారాలను దెబ్బతీస్తోందని ప్రియాంక మండిపడ్డారు.