
టీఆరెస్ పార్టీ డబ్బులు ఇచ్చిన వారికే పదవులు ఇస్తుందన్నారు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు పోశెట్టి. మంగళవారం నిజామాబాద్ లో మాట్లాడిన ఆయన.. కార్పొరేషన్ లో 5 సంవత్సరాలు అవినీతి జరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అయిన సరే మంచి వారిని గెలిపించి అవినీతి పరులను ఓడగొట్టాలని చెప్పారు. నిజామాబాద్ నగరం అభివృద్ధి మొత్తం శూన్యం…800 కోట్ల అభివృద్ధి జరిగిందంటున్న నాయకుల మాటలపై కలెక్టర్ విచారణ జరపాలన్నారు.
సంవత్సరానికి 100 కోట్లు ప్రభుత్వం ఇస్తుంటే ఎందుకు అభివృద్ధి జరగడం లేదని ప్రశ్నించారు. నిజామాబాద్ మునిసిపల్ అధికారులు మొత్తం అవినీతికి పాల్పడుతున్నారన్న పోశెట్టి.. అవినీతి తట్టుకోలేక బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.