పిల్లలు, మహిళలు, వృద్దులు, యువకుల కోసం ప్రభుత్వం అనేక పోస్టాఫీస్ ద్వారా అనేక పొదుపు పథకాలను అమలు చేస్తోంది. తద్వారా చిన్న మొత్తాల పొదుపును ప్రోత్సహిస్తోంది. పోస్టాఫీసుల ద్వారా పెద్ద మొత్తాలను కూడా కూడబెట్టవచ్చు.
ముఖ్యంగా మహిళలు పెద్దమొత్తంలో డబ్బులు దాచుకునేందుకు ప్రభుత్వం పోస్టాఫీస్ ద్వారా బెస్ట్ స్కీంలు ఉన్నాయి. వాటిలో ఒకటి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్. దీని ద్వారా మహిళలు తక్కువ సమయంలో అధిక వడ్డీని పొందవచ్చు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం ద్వారా పెట్టుబడి పెట్టే విధానం, పొందే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం.
మహిళలు కొద్దికాలం పాటు పెట్టుబడింది పెట్టడం ద్వారా కూడా మంచి రాబడిని పొందవచ్చు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ ద్వారా పెట్టే పెట్టుబడికి రూ. 7.5 శాతం వరకు వడ్డీని పొందవచ్చు.
ఈ పథకం ద్వారా రెండేళ్ల వరకు పెట్టుబడి పెట్టా్ల్సి ఉంటుంది.. గరిష్టంగా రూ. 2లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. 2023లో ప్రారంభించబడిన ఈ పథకం.. అత్యంత ప్రజాదరణ పొందింది.
మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిపికెట్ స్కీమ్ లో రెండేళ్లపాటు రూ. 2లక్షలు పెట్టుబడిపెడితే 7.5 శాతం ఇస్తారు. మొదటి సంవత్సరం రూ. 15వేల వడ్డీ, స్థిరవడ్డీ రేటుతో వచ్చే ఏడాది మొత్తం మొత్తంపై వచ్చే వడ్డీ రూ. 16వేల 125. అంటే రెండేళ్ల వ్యవధిలో కేవలం రూ. 2లక్షల పెట్టుబడిపై మొత్తం రాబడి రూ. 31వేల 125 పొందవచ్చు.