నిజామాబాద్ జిల్లా బోధన్లో అధికార పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు హల్ చల్ చేస్తున్నాయి. బోధన్ పట్టణంలోని ప్రతీ చౌరస్తాలో ఎమ్మెల్యే షకీల్ అమీర్కు వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఇటీవల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే..తానే కొంటా అని చెప్పిన ఎమ్మెల్యే షకీల్.. 20 రోజులుగా అదృశ్యం అయ్యడంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. బీజేపీ బోధన్ నియోజకవర్గం పేరిట రెండు రకాల పోస్టర్లు వెలిశాయి.
జాడలేని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్...
వడగండ్ల వానలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటానని జాడ లేకుండా పోయినవ్ చెప్పిన నాటి నుంచి ఇప్పటి దాకా గింజకూడా ధాన్యం కొనలే. ఇప్పటికైనా కళ్లు తెరుచుకుని ప్రతి గింజ ధాన్యం కొనాల్సిందే..
కనపడుట లేదు..
తడిచిన ధాన్యాన్ని నేనే కొంటానన్న ఎమ్మెల్యే షకీల్ అమీర్ గారు.. చెప్పిన నాటి నుంచి ఇప్పటి వరకు గింజ కొనని ఎమ్మెల్యే షకీల్ గారు.. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రతీ ధాన్యం గింజను కొనాల్సిందే..