
హైదరాబాద్, వెలుగు: జీవో 317తో ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్టు లెక్చరర్లకు తిరిగి ఇంటర్ విద్యాశాఖ పోస్టింగ్స్ ఇచ్చింది. మల్టీజోన్ 1 లో 25 మందికి, మల్టీజోన్-2లో ఏడుగురికి తిరిగి పోస్టింగ్స్ ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోయిన మరో 20 మందికి ఒకట్రెండు రోజుల్లో పోస్టింగ్స్ ఇవ్వనున్నట్టు అధికారులు గురువారం తెలిపారు. కాగా, కాంట్రాక్టు లెక్చరర్లను రీఅలాట్మెంట్ చేయడం పట్ల టిగ్లా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, రామకృష్ణగౌడ్, జీసీసీఎల్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.