హైదరాబాద్, వెలుగు: అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఎంపికైన 1,061 మందికి ఈ నెల 22న పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. 22న శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో ఎంపికైన వాళ్లందరూ పాల్గొనాలని సూచించారు.
ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లతో హరీశ్‌రావు గురువారం అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త కాలేజీల్లో వైద్య సేవలపై ఆరా తీశారు. పేషెంట్లతో ప్రేమగా మాట్లాడాలని, అన్ని టీచింగ్ హాస్పిటళ్లలో 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.