అందెశ్రీ మృతి సాహితీ రంగానికి తీరని లోటు : పోటు రంగారావు

అందెశ్రీ మృతి సాహితీ రంగానికి తీరని లోటు : పోటు రంగారావు

ఖమ్మం టౌన్, వెలుగు : వాగ్గేయకారుడు, తెలంగాణ గీతం గేయ రచయిత అందెశ్రీ మృతి సాహితీ రంగానికి తీరని లోటని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. సోమవారం స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో అందెశ్రీ మృతికి సంతాపంగా ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. 

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పదవులకు లొంగని ప్రజల పక్షపాతి అందెశ్రీ అని అన్నారు. ప్రాథమిక విద్య కూడా లేని అందెశ్రీ అద్భుతమైన సాహిత్యాన్ని తన పాటల్లో వ్యక్తపరిచారని తెలిపారు. మరోవైపు ఖమ్మం జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ పీపుల్స్ జేఏసీ ఆధ్వర్యంలో అందెశ్రీకి ఘనంగా నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు, కవులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.