మెదక్ జిల్లా: కరెంట్ కోతలను నిరసిస్తూ రైతుల ఆందోళన.. రోడ్డుకు అడ్డంగా బైక్ లు, ట్రాక్టర్ పెట్టి రాస్తారోకో

మెదక్ జిల్లా:  కరెంట్ కోతలను నిరసిస్తూ రైతుల ఆందోళన.. రోడ్డుకు అడ్డంగా బైక్ లు, ట్రాక్టర్  పెట్టి రాస్తారోకో
  •   చేగుంట మండలం మక్కరాజుపేట వద్ద రాస్తారోకో

 మెదక్/చేగుంట, వెలుగు : కరెంట్ కోతలను నిరసిస్తూ మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేట వద్ద గజ్వేల్ ప్రధాన రహదారిపై బుధవారం  రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా బైక్​ లు, ట్రాక్టర్  పెట్టి రాస్తారోకో చేశారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరెంట్​కోతతో  పంటలు ఎండిపోతున్నాయని,  లోవోల్టేజీ వల్ల బోరు మోటార్లు, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్తున్నప్పటికీ, కనీసం 8 గంటలు కూడా త్రీఫేజ్​ కరెంటు రావడం లేదని వాపోయారు.

 మరో 15 రోజుల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తే  పంట చేతికి వస్తుందని తెలిపారు.  ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి పంటలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.