ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీకి కరెంట్ కట్

ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీకి కరెంట్ కట్

పేరుకుపోయిన రూ.47 లక్షలు బిల్లులు 

మెట్ పల్లి, వెలుగు : కరెంట్ బిల్లులు చెల్లించడం లేదని జగిత్యాల జిల్లా ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీకి విద్యుత్ శాఖాధికారులు కరెంట్ కట్ చేశారు. కొన్నేండ్లుగా ఫ్యాక్టరీ యాజమాన్యం కరెంట్ ​బిల్లులు కట్టకపోవడంతో భారీగా బకాయిలు పేరుకుపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై విద్యుత్ శాఖ మెట్ పల్లి ఏడీ మనోహర్ ను వివరణ కోరగా ‘చాలా ఏండ్లుగా ఫ్యాక్టరీ యాజమాన్యం కరెంటు బిల్లులు కట్టడం లేదు. ఎన్నోసార్లు బిల్లులు కట్టాలని నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ఫ్యాక్టరీ లే ఆఫ్ చేసిన చేసిన 2014 వరకే సుమారు 47 లక్షలు చెల్లించాల్సి ఉంది. అప్పటి నుంచి ఫ్యాక్టరీ పరికరాల సెక్యూరిటీ కోసం కరెంట్ సరఫరా చేస్తున్నాం. బకాయి ఇంకా పెరిగిపోవడంతో ఉన్నతాధికారుల అదేశాలతో 15వ తారీఖున కరెంట్ సరఫరా నిలిపివేశాం’ అని చెప్పారు.