బిల్లు కడ్తలేరని బిల్ట్​కు పవర్ కట్ : ఇబ్బందుల్లో కార్మికులు

బిల్లు కడ్తలేరని బిల్ట్​కు పవర్ కట్ : ఇబ్బందుల్లో కార్మికులు

మంగపేట, వెలుగు: బిల్లులు కట్టకపోవడంతో విద్యుత్ శాఖ ఆఫీసర్లు బిల్ట్ కంపెనీకి శనివారం రాత్రి నుంచి కరెంటు నిలిపివేశారు. దీంతో కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బిల్ట్ కంపెనీ చెల్లించాల్సిన కరెంటు బిల్లులు రూ. 8 కోట్లకు పైగా పెండింగ్ లో ఉండటంతో కంపెనీకి
పవర్ కట్ చేసేందుకు విద్యుత్ శాఖ ఆఫీసర్లు ఇప్పటికే పలుమార్లు ప్రయత్నించారు. కార్మికులు, జేఏసీ నాయకులు వాళ్లను అడ్డుకుని స్థానిక జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావులకు చెప్పి .. వారి జోక్యంతో ఆ ఫీసర్లను వెనక్కి మళ్లించారు.

శుక్రవారం సాయంత్రం బిల్ట్​కు కరెంట్ కట్ చేయడం కోసం విద్యుత్ శాఖ ఆఫీసర్లు కంపెనీ దగ్గరకు మరోసారి వెళ్లగా కార్మికులు అడ్డుకోవడం, మంత్రి జోక్యం చేసుకోవడంతో సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో విద్యుత్ శాఖ అధికారులు శనివారం రాత్రి బిల్ట్ కంపెనీకి, కంపెనీ కాలనీకి కరెంట్ సప్లై ఆపేశారు. శనివారం రాత్రి నుంచి కరెంటు లేకపోవడంతో కార్మికులు, వారి కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయి. జడ్పీ చైర్మన్ కుసుమ, ఎమ్మెల్యే సీతక్క, మంత్రి దయాకర్ రావు జోక్యం చేసుకుని కరెంటు సప్లై అయ్యేలా చూడాలని కోరుతున్నాయి.