అధికారం ఎవరికీ శాశ్వతం కాదు:  కుమారస్వామి

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు:  కుమారస్వామి

కర్ణాటక అసెంబ్లీలో సోమవారం జరిగిన బలపరీక్షలో సీఎం బిఎస్ యడ్యూరప్ప విజయం సాధించారు. ఆ తర్వాత మాజీ సీఎం కుమారస్వామి మాట్లాడుతూ..  గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని, బీజేపీ రెబల్ ఎమ్మెల్యేలను రోడ్డున వదిలేసిందని ఆయన అన్నారు. అధికారమనేది ఎవరికీ శాశ్వతం కాదని, అది మోడీ అయినా, జేపీ నడ్డా అయినా ఒకటేనని అన్నారు. తామేమీ ఆ పార్టీ(BJP)కి చెందిన ఎమ్మెల్యేల సంఖ్యను తగ్గించబోమని ,  కర్ణాటక రాష్ట్ర ప్రజల కోసం ప్రతిపక్ష స్థానంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని కుమారస్వామి అన్నారు.