భారత్ బంద్.. రాష్ట్రాలకు విద్యుత్ శాఖ అడ్వైజరీ..

భారత్ బంద్.. రాష్ట్రాలకు విద్యుత్ శాఖ అడ్వైజరీ..

ట్రేడ్ యూనియన్లు రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. విద్యుత్ కార్మికులు సైతం సమ్మెలో పాల్గొంటుండటంతో అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. సమ్మె ప్రభావం విద్యుత్ పంపిణీ వ్యవస్థపై పడకుండా చూసుకోవాలని.. ప్రజలకు నిరంతర కరెంట్ సరఫరా కొనసాగేలా చూడాలని సూచించింది. అత్యవసర పరిస్థితులు తలెత్తితే సమస్యలు పరిష్కరించేందుకు అదనపు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని లేఖలో స్పష్టం చేసింది. ఈ రెండు రోజుల్లో షట్ డౌన్ ప్రోగ్రాం షెడ్యూల్ చేసి ఉంటే వాటిని మరో డేట్ కు మార్చుకోవాలని చెప్పింది. 

28, 29 తేదీల్లో కంట్రోల్ రూమ్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర విద్యుత్ శాఖ సూచించింది. హాస్పిటళ్లు, రక్షణ, రైల్వే తదితర అత్యవసర సర్వీసులకు ఎలాంటి ఇబ్బందులు చూసుకోవాలని, సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు పూర్తి సన్నద్ధతతో ఉండాలని స్పష్టం చేసింది.

For more news..

రేపు, ఎల్లుండి భారత్ బంద్

తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై నిందలు