ఈదురుగాలులకు పడిపోయిన విద్యుత్ స్తంభాలు

ఈదురుగాలులకు పడిపోయిన విద్యుత్ స్తంభాలు

బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులకు చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.  బొర్లం, తాడుకోలు, కొత్తబాది తదితర గ్రామీణ ప్రాంతాలతో పాటు బాన్సువాడ పట్టణంలోని కలికిచెరు కట్టమీద మినీ ట్యాంక్ బండ్ ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు పడిపోయి తీవ్ర నష్టం జరిగింది.  ఈదురు గాలుల వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.  బోర్లం గ్రామంలో ఓ ఇంటి మీద ఉన్న రేకులు ఎగిరిపోయాయి.  విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు స్తంభాలు కూడా కిందపడిపోయాయి.