మార్కెట్లోకి మహీంద్రా పవరాల్ డీజిల్ జనరేటర్లు

మార్కెట్లోకి మహీంద్రా పవరాల్ డీజిల్ జనరేటర్లు

హైదరాబాద్​, వెలుగు : పవర్ సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌ ప్రొవైడర్ల రీకాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మహీంద్రా పవరాల్ డీజిల్ జనరేటర్లను హైదరాబాద్​ మార్కెట్లో గురువారం లాంచ్​ చేసింది. తాము మహీంద్రా పవరాల్ జెన్‌‌‌‌‌‌‌‌సెట్​కు  ఒరిజనల్​ ఎక్విప్​మెంట్​మాన్యుఫాక్చరర్​(ఓఈఎం) అని తెలిపింది. ఈ జెన్​సెట్లను సీపీసీబీ4  ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశామని తెలిపింది.

ఇవి 625 కేవీఏ వరకు కరెంటును ఉత్పత్తి చేస్తాయి. ధరలు రూ.1.5 లక్షల నుంచి మొదలవుతాయి. హైదరాబాద్​ ప్లాంటులో వీటిని తయారు చేశామని రీకాన్​ తెలిపింది. దీని కోసం రూ.12 కోట్లు ఇన్వెస్ట్​ చేశామని తెలిపింది. జెన్​సెట్​ మార్కెట్లో తమకు 23 శాతం వాటా ఉందని మహీంద్రా తెలిపింది.