హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ కొనసాగుతున్నది. రెండో రోజు విచారణలో భాగంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల టైంలో ఉపయోగించిన మూడు సెల్‌ఫోన్ల ఈఎంఈఐ నంబర్ల ఆధారంగా ప్రశ్నలు సంధించారు. ప్రభాకర్ రావు ఇప్పటికే రెండు ఫోన్లను అప్పగించగా, మూడో ఫోన్‌ను మాత్రం సిట్‌కు అందజేయలేదు.
సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఫార్మాట్ చేసినట్టు సిట్ గుర్తించింది. దీంతో వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్)కు పంపించారు.
