
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తోన్న చిత్రం ఆదిపురుష్.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2023 జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ మూవీ థియేటర్ లోకి రాకముందే బడ్జెట్లో దాదాపు 85 శాతం రికవరీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ మూవీకి నిర్మాతలు సుమారు రూ.500 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. అయితే సినిమా ఇంకా థియేటర్లలోకి రాకముందే ఏకంగా రూ.432 కోట్లు రాబట్టినట్టు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
పాన్ ఇండియాలో లెవెల్ లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్ ఇతర అనుబంధ హక్కులతో కూడిన నాన్ థియెట్రికల్ రైట్స్ మొత్తం రూ.247 కోట్లకు అమ్ముడయ్యాయట. దీంతోపాటు ఈ సినిమాకి సౌత్ థియేట్రికల్ రైట్స్ ద్వారా సుమారు రూ.185 కోట్లు వచ్చినట్లు చెబుతున్నారు. అలా నాన్ థియేట్రికల్, థియేట్రికల్ మొత్తం కలుపుకొని విడుదలకు ముందే ఆదిపురుష్ సినిమాకి రూ. 432 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు పొందిన రికవరీస్‌తో నిర్మాతలు సేఫ్‌గా ఉన్నారు. థియేటర్లలో ఈ సినిమా టోటల్‌గా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు.టి సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించారు. జూన్ 6వ తేదీన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో కనీవిని ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.