ప్రభాస్ ఫౌజీ రిలీజ్ డేట్ ఫిక్స్...

ప్రభాస్ ఫౌజీ రిలీజ్ డేట్ ఫిక్స్...

వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’తోపాటు హను రాఘవపూడి డైరెక్షన్‌‌లో  ఓ సినిమా  చేస్తున్నాడు. ‘రాజా సాబ్’ ఫారిన్ షెడ్యూల్‌‌లో పాల్గొంటున్న ప్రభాస్ అతి త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నట్టు  ప్రకటించారు. మరోవైపు హను రాఘవపూడి రూపొందిస్తున్న మూవీ కూడా ఇప్పటికే అరవై శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. 

మరో  ముప్ఫై ఐదు రోజులు షూటింగ్ చేస్తే  ప్రభాస్‌‌కు సంబంధించిన కీలక సన్నివేశాలు పూర్తవుతాయట.  తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌‌ గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.  2026 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం  రోజున ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. 1940 బ్యాక్‌‌డ్రాప్‌‌  దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో ఇదే  సరైన రిలీజ్ డేట్‌‌ అని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.  

బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలోని  సైనికుడిగా ప్రభాస్ కనిపించనున్నాడట.  దేశభక్తి, ప్రేమ, త్యాగం , స్వాతంత్ర్యం కోసం ఆ సైనికుడి ప్రయాణం ఎలా సాగిందనే కథాంశంతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లూయెన్సర్ ఇమాన్వి హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ  చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. త్వరలోనే టైటిల్, రిలీజ్ డేట్‌‌పై అఫీషియల్ అనౌన్స్‌‌మెంట్ రానుందని తెలుస్తోంది.