స్పిరిట్ మూవీలో ఐపీఎస్‌‌ టాపర్‌‌గా.. ప్రభాస్

స్పిరిట్ మూవీలో ఐపీఎస్‌‌ టాపర్‌‌గా.. ప్రభాస్

‘‘పోలీస్‌‌ సైరన్‌‌తో ఉన్న వెహికల్స్‌‌ ఆగి డోర్స్‌‌ తెరుచుకున్నాయి.. పోలీస్‌‌ బూట్ల చప్పుళ్ల మధ్య సెంట్రల్‌‌ జైలులో ప్రభాస్‌‌ ఎంట్రీ. అతనొక ఐపీఎస్‌‌ ఆఫీసర్‌‌‌‌..  అకాడమీ టాపర్‌‌‌‌..  కానీ రిమాండ్ ఖైదీగా జైలుకి వచ్చాడు. ‘ఇది నీ పరేడ్ గ్రౌండ్‌‌ కాదు.. వాక్‌‌ ఫాస్ట్’ అంటూ జైలర్‌‌‌‌గా ప్రకాష్​ రాజ్ ధిక్కార స్వరం’’.. ‘స్పిరిట్‌‌’ సినిమా టీజర్‌‌‌‌లో సీన్‌‌ ఇది.  దీన్ని వీడియోలా కాకుండా ఆడియో రూపంలో డిజైన్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ప్రభాస్‌‌ బర్త్ డే సందర్భంగా ఈ ఆడియో టీజర్‌‌‌‌ను విడుదల చేశారు.  ‘వీడి గురించి విన్నా.. యూనిఫాం ఉన్నా లేకపోయినా బిహేవియర్‌‌‌‌లో తేడా ఉండదని. 

కాండక్ట్‌‌ ఇష్యూస్‌‌ వల్ల ఒకసారి టెర్మినేట్ అయ్యాడని..  చూద్దాం ఈ ఖైదీ యూనిఫాంలో ఎలా బిహేవ్ చేస్తాడో..’ అంటూ జైలర్‌‌‌‌గా జులుం చూపించాడు ప్రకాష్​ రాజ్.  అందుకు ప్రభాస్... ‘‘మిస్టర్‌‌‌‌ సూపరింటెండెంట్‌‌.. నాకు చిన్నప్పటి నుండి ఒక చెడ్డ అలవాటు ఉంది.. రైట్‌‌ ఫ్రమ్‌‌ ఎ చైల్డ్‌‌ హుడ్‌‌ ఐ జస్ట్ హ్యావ్‌‌ వన్‌‌ బ్యాడ్‌‌ హ్యాబిట్” అని బదులిచ్చాడు. ఇంతకూ ఆ చెడ్డ అలవాటు ఏమిటి.. ఐపీఎస్‌‌ ఆఫీసర్‌‌‌‌ జైలుకు ఎందుకు వచ్చాడు అనేది ‘స్పిరిట్‌‌’ మెయిన్‌‌ కాన్సెప్ట్‌‌. 

త్రిప్తి డిమ్రి హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టీ-సిరీస్ బ్యానర్స్‌‌పై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌‌పైకి వెళ్ళనుంది.