
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రూ. 10 లక్షల విరాళం అందించాడు. ప్రభాస్ తరపున యూవీ క్రియేషన్స్ సంస్థ సభ్యులు రూ.10 లక్షల చెక్కును భద్రాచలం ఆలయ ఈఓ రమాదేవికి శనివారం అందచేశారు. ఇందులో భాగంగానే.. ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ఆదిపురుష్ మూవీ సూపర్ సక్సెస్ అవ్వాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విరాళంగా అందజేసిన మొత్తాన్ని.. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నిత్యాన్నదాన పథకానికి కేటాయించాలని ప్రభాస్ సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఆదిపురుష్ సినిమా విషయానికి వస్తే.. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ మూవీలో బాలీవుడ్ నటి కృతి సనన్ జానకి పాత్రలో కనిపిస్తోంది. ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
550 కోట్ల భారీ బడ్జెట్ తో, పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని గుల్షన్ కుమార్, టీ సిరీస్ సమర్పణలో భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతారియా, రాజేశ్ నాయర్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.