
ప్రభాస్ చేసేవన్నీ ప్యాన్ ఇండియా చిత్రాలు కావడంతో పూర్తి కావడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటాయి. దాంతో అప్‌డేట్స్ కూడా అరుదుగా వస్తుంటాయి. ‘ఆదిపురుష్’ విషయంలోనూ అదే జరుగుతోంది. ఇంతవరకు ఒక్క లుక్ కూడా బైటికి రాలేదు. ఈ యేడు ఆగస్ట్ 11న సినిమా విడుదలవుతుందని ప్రకటించినప్పుడు ఇక అప్‌డేట్స్ వచ్చేస్తాయని ఆశించారంతా. కానీ రిలీజ్ కాస్తా నెక్స్ట్ ఇయర్‌కి షిఫ్టయ్యింది. జనవరి 12న కొత్త ముహూర్తం ఫిక్స్ చేశారు. దాంతో అప్పటి వరకు వెయిట్ చేయాలా అని మళ్లీ నిరాశలో పడ్డారు ఫ్యాన్స్. కానీ ఆ అవసరం లేదు. వారి కోసం ఓ స్పెషల్ ట్రీట్ రెడీ అవుతోంది. ‘ఆదిపురుష్’ నుంచి ప్రభాస్ లుక్ రాబోతోంది. ఇందులో ప్రభాస్ రాముడిగా నటిస్తుండటంతో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఏప్రిల్ 10న అతని లుక్‌ని రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈలోపు ‘రాధేశ్యామ్’తో ఓటీటీలో సందడి చేయనున్నాడు ప్రభాస్. రేపటి నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది.