సపోర్ట్ స్టాఫ్కు పదివేలు.. ప్రభాస్ గ్రేట్ అంటూ కామెంట్స్

సపోర్ట్ స్టాఫ్కు పదివేలు.. ప్రభాస్ గ్రేట్ అంటూ కామెంట్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) తన సపోర్టింగ్ స్టాఫ్ కు పదివేల రూపాయలు కానుకగా ఇచ్చాడు. తన కోసం నిర్విరామంగా శ్రమించిన తన పర్సనల్ స్టాఫ్ కు ఈ చిరు కానుక అందించి ప్రశంశించాడట ప్రభాస్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక ప్రభాస్ నటించిన లేటెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ మూవీ ఆదిపురుష్(Adipurush) విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్.. మరోపక్క ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్ షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. ఈ టైట్ షెడ్యూల్స్ తో ప్రభాస్ కోసం తన టీమ్ కూడా విరామం లేకుండా కృషి చేశారట. 

వాళ్ళ కష్టాన్ని గుర్తించిన ప్రభాస్ తన సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ తలా పదివేల రూపాయాల బాహుమానం ఇచ్చాడట. ఈ విషయం తెల్సుకున్న ప్రభాస్ ఫాన్స్.. మా డార్లింగ్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.