లోకేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనగరాజ్ తో ప్రభాస్?

లోకేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనగరాజ్ తో ప్రభాస్?

ఏడాదికి రెండు సినిమాలైనా అందించాలని వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు ప్రభాస్. కానీ అవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కూడిన భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో ఆలస్యమవుతున్నాయి. అయితే ఇప్పటికే తన చేతిలో ఐదు సినిమాలు ఉండగా, తాజాగా మరో సినిమా ఈ వరుసలో చేరబోతోందట. కమల్ హాసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ‘విక్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ తీసి బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకున్న లోకేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనగరాజ్.. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతకంటే ముందు తీసిన ఖైదీ, మాస్టర్ సినిమాలు కూడా సూపర్ హిట్స్. దాంతో అతనితో సినిమా చేసేందుకు చాలామంది స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ లోకేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రం ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో భారీ యాక్షన్ మూవీకి ప్లాన్ చేస్తున్నాడట.

ఇటీవల తనను కలిసి దీనిపై చర్చించాడనే ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్టే. కానీ ఇందుకు చాలా టైమ్ పడుతుంది. ‘ఆదిపురుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే పూర్తి చేసిన ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌... సాలార్, ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్ సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘స్పిరిట్ చేయాల్సి ఉంది’. మరోవైపు తమిళనాట విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సినిమా చేస్తోన్న లోకేష్... ఖైదీ, విక్రమ్ సినిమాలకు సీక్వెల్స్ చేయాల్సి ఉంది. మరి ఈ కమిట్మెంట్స్ అన్నీ పూర్తయి వీళ్లిద్దరి కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి!