రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇప్పుడు తన తదుపరి చిత్రాలపై డార్లింగ్ పూర్తి ఫోకస్ పెట్టారు. అటు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, ఇటు సందీప్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్న ‘స్పిరిట్’ చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్ తో తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే ఈ ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ప్రభాస్ ఒక చిన్న విరామం తీసుకున్నారు.
సమ్మర్ వెకేషన్ ప్లాన్
లేటెస్ట్ గా ప్రభాస్ హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో విదేశాలకు వెళ్లారు. ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ప్రభాస్ దాదాపు 10 రోజుల పాటు ఇటలీలో సమ్మర్ వెకేషన్‌ను ఆస్వాదించనున్నారు. వరుసగా సినిమా షూటింగ్స్ చేస్తూ క్షణం తీరికలేకుండా ఉన్న ప్రభాస్ .. ఈ విరామం తర్వాత సరికొత్త ఎనర్జీతో తిరిగి రానున్నారు.
►ALSO READ | మెగా ఫోన్ పట్టిన కిరణ్ అబ్బవరం.. భారీ ఆఫర్‌ను పక్కనబెట్టి 'రియాలిటీ'తో రెడీ!
తిరిగి రాగానే ‘కల్కి 2’ మ్యాజిక్!
ఈ వెకేషన్ ముగించుకుని ఏప్రిల్ 10న ప్రభాస్ హైదరాబాద్ చేరుకుంటారు. వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కల్కి 2898 AD’ సీక్వెల్ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఈ భారీ సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కాగా, ప్రభాస్ జాయిన్ అయ్యే షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి భాగం సృష్టించిన సంచలనం దృష్ట్యా, రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
వరుస సినిమాలతో..
ప్రభాస్ లైనప్ చూస్తుంటే అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఈ ఏడాది చివర్లో' ఫౌజీ' సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో ప్రభాస్ లుక్ సరికొత్తగా ఉండబోతోందని టాక్. 2027 మార్చిలో 'స్పిరిట్' సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. మరో వైపు కల్కి సీక్వెల్ షూటింగ్ మాత్రం శరవేగంగా జరగనుంది. మొత్తానికి ‘డార్లింగ్’ రిలాక్స్ అయి వచ్చి బాక్సాఫీస్ వద్ద మళ్ళీ తన ప్రభంజనాన్ని ఎలా సృష్టిస్తారో చూడాలి..
