Kalki 2898 AD OTT Official: కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Kalki 2898 AD OTT Official: కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన కల్కి 2898 AD మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కల్కి థియేట్రికల్ రన్ ఆల్ మోస్ట్ ముగిసిందనే చెప్పుకోవాలి. దీంతో ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో 'ఈనెల (ఆగస్ట్ 22) నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఓటీటీ పాట్నర్ అమెజాన్ ప్రైమ్‌ ప్రకటించింది.ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని నేడు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది. 

జూన్ 27 థియేటర్లో రిలీజైన ఈ సినిమా కల్కి తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం వెర్షన్‌లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ కు వస్తుండగా హిందీ వెర్షన్‌ మాత్రం నెట్‌ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ రైట్స్‌ను సుమారు రూ. 378 కోట్ల భారీ మొత్తానికి ఈ రెండు ప్లాట్ ఫామ్స్ దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. 

ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో కథ, కథనం, విజువల్స్, గ్రాఫిక్స్, వాటిని నాగ్ అశ్విన్ ప్రెజెంట్ చేసిన విధానానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. దాంతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.విడుదలైన15 రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాకి ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్టు సమాచారం.

Also Read:-ఆనందో బ్రహ్మా..తాత మనవళ్లుగా వచ్చేస్తున్న తండ్రీకొడుకులు