
సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా ‘జనక అయితే గనక’. సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. గురువారం ఈ మూవీ టీజర్‌ను ప్రభాస్ రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ‘ఆ ఒక్క నిర్ణయం నా లైఫ్‌ను మార్చేసింది..’ అనే డైలాగ్‌తో మొదలైన టీజర్‌లో మిడిల్ క్లాస్ కష్టాలను ఫన్నీగా చూపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచారు.
‘నేను ఒక వేళ తండ్రినైతే.. నా పిల్లల్ని బెస్ట్ స్కూల్‌లో చేర్పించాలి.. మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి.. బెస్ట్ జీవితాన్ని ఇవ్వాలి.. బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదు’ అని అనుకుంటాడు సుహాస్. తను చదువు మొత్తం పూర్తి చేయడానికి ఇరవై ఐదు వేలు ఖర్చయితే.. ఇప్పుడు ఎల్‌కేజీకే లక్షలు కట్టాల్సి వస్తోందని ఫ్రస్ట్రేషన్ ఫీలవుతుంటాడు. అందుకే పిల్లలు వద్దనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది అసలు కథ. సుహాస్ భార్యగా హీరోయిన్ సంగీర్తన, తండ్రి పాత్రలో గోపరాజు రమణ, జడ్జిగా రాజేంద్ర ప్రసాద్ కనిపించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం ఆకట్టుకుంది.