షారుఖ్ ఈగో మీద కొట్టిన సలార్.. 28 ఏళ్ళ మరాఠా మందిర్ సెంటిమెంట్ బ్రేక్

షారుఖ్ ఈగో మీద కొట్టిన సలార్.. 28 ఏళ్ళ మరాఠా మందిర్ సెంటిమెంట్ బ్రేక్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shahrukh khan) కు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలంటే ఫ్యాన్స్ ఎగబడతారు. ఇక ఆయన సినీ కెరీర్ లో దిల్‌ వాలే దుల్హేనియా లేజాయేంగే సినిమాకు చాలా ప్రత్యేకత ఉంది. షారుఖ్, కాజోల్ జంటగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కొన్ని థియేటర్స్ లో అయితే సంవత్సరాల తరబడి ఆడింది ఈ మూవీ.

ఇక ముంబై లోని మరాఠా మందిర్ థియేటర్లో ఇప్పటికే దిల్‌ వాలే దుల్హేనియా లేజాయేంగే సినిమానుం ప్రదర్శిస్తూనే ఉన్నారు. అంటే దాదాపు 28 సంవత్సరాలుగా ఈ సినిమా మరాఠా మందిర్ లో ప్రదర్శితమవుతూనే ఉంది. అయితే 28 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. డంకి సినిమా రిలీజ్ ముందు వరకు మరాఠా మందిర్ లో రోజుకు ఒక షో దిల్‌ వాలే దుల్హేనియా లేజాయేంగే మూవీ వేస్తూ.. మిగిలిన సమయంలో లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ యానిమల్ షోస్ వేశారు. డంకి రిలీజ్ తరువాత యానిమల్ ను తీసేసి ఆ స్థానాల్లో డంకి సినిమా షోస్ వేశారు. ఆయితే.. ప్రభాస్ సలార్ రిలీజ్ నేపధ్యంలో డంకి సినిమాను సైతం పక్కన పెట్టేసి సలార్ సినిమా షోస్ వేశారు మరాఠా మందిర్ యాజమాన్యం. నిజానికి ఈ థియేటర్ లో షారుఖ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అలాంటిది డంకి సినిమాను ఒక్కరోజు ప్రదర్శించి.. తరువాత సలార్ షోస్ వేయడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో షారుఖ్‌ సొంత గడ్డపై ఆయన ఈగోపై సలార్‌ దెబ్బ కొట్టినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.