Salaar Twitter Review : ప్రభాస్ వ‌న్ మెన్ షో.. ఊర మాస్ ఇంటర్వెల్, ఒక్కో సీన్ గూస్‌బంప్స్

Salaar Twitter Review :  ప్రభాస్ వ‌న్ మెన్ షో..  ఊర మాస్ ఇంటర్వెల్, ఒక్కో సీన్ గూస్‌బంప్స్

బహుబలి సినిమా తరువాత ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్  సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.  ఈ  క్రమంలో కేజీఎఫ్ లాంటి సినిమాతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ అనే సినిమాను చేశాడు ప్రభాస్ .. రెండు పార్ట్ లుగా  వస్తోన్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ భారీ అంచనాల నడుమ 2023 డిసెంబర్ 22 శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఇప్పటికే  బెనిఫిట్ షోస్ కూడా అయిపోవడంతో  ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రయాన్ని వెల్లడిస్తున్నారు. 

ముందుగా ఊహించినట్లే సలార్ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఎక్కడా చూసిన ఓన్లీ ప్రభాస్ వ‌న్ మెన్ షో అనే టాక్ బలంగా వినిపిస్తుంది.  యాక్షన్ సీన్స్ గురించి ఆడియన్స్ చాలా స్పెషల్ గా మాట్లాడుతున్నారు ఆడియన్స్.  రాజమౌళిని బోయపాటిని మిక్సీలో వేసి తీసినట్లున్నాయ్ అని అంటున్నారు.  కేజీఎఫ్ కు మించి సినిమా ఉందంటున్నారు. థియేటర్ షేక్ కావడానికి ఒక్క  ఇంటర్వెల్ సీన్ చాలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రభాస్‌, పృథ్వీరాజ్ మ‌ధ్య ఫ్రెండ్ షిప్ బాండింగ్‌ను చాలా ఎమోష‌న‌ల్‌గా ప్రశాంత్ నీల్‌ ఈ సినిమాలో చూపించాడ‌ని ట్వీట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా  సీక్వెల్‌కు సంబంధించి వ‌చ్చే ట్విస్ట్ కూడా అదిరిపోతుంద‌ని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

ఎన్నాళ్లకు మళ్లీ కాలర్ ఎగరేసుకుంటూ థియేటర్లో నుంచి బయటకు వచ్చాం భయ్యా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.   ప్రభాస్ హీరోయిజాన్ని ప్రశాంత్ నీల్‌ పీక్స్‌లో చూపించాడని అంటున్నారు.  ఇది కదా మాకు కావాల్సింది అంటూ ఎక్స్ లో రాసుకోస్తు్న్నారు.  స‌లార్‌తో టాలీవుడ్‌, బాలీవుడ్‌ల‌లోని అన్ని ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను ప్రభాస్ తిర‌గరాయ‌డం ప‌క్కా అని చెబుతున్నారు. సెంకడ్ పార్ట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నామని చెబుతున్నారు.  

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో దేవా పాత్రలో ప్రభాస్  కనిపించగా,  వ‌ర‌ద‌రాజా పాత్రలో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ నటించాడు. ప్రభాస్  కు జోడీగా శృతి హాసన్ నటించింది.  జగపతిబాబు,   బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రీయారెడ్డి కీలక పాత్రల్లో కనిపించారు.  హోంబలే ఫిలింస్ బ్యానర్ పై  విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మించగా,  రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు.