
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న మరో మూవీ సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తోంది. సలార్ లో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా నటిస్తుండటం మరో విశేషం. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. జులై 06వ తేదీ గురువారం తెల్లవారుజామున 5:12 గంటలకు టీజర్ విడులైంది.
ఎలా ఉందంటే..
నిమిషం 47 సెకన్ల టీజర్ కిర్రాక్ అనిపిస్తోంది. టీనూ ఆనంద్ డైలాగ్‌తో టీజర్ మొదలైంది. లయన్.. చిరుత.. టైగర్.. ఏనుగు.. వెరీ డేంజరస్.... కానీ, జురాసిక్ పార్క్‌లో కాదు.... ఎందుకుంటే ఆ పార్కులో....అంటూ అతడు డైలాగ్ ఆపడంతోనే ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడం టీజర్‌లో హైలైట్ అని చెప్పొచ్చు. టీజర్లో పవర్‌ఫుల్ ఫైట్‌ను చూస్తుంటే సినిమాలో అంతకుమించి ఫైట్ సీన్స్ ఉంటాయని అర్థమవుతోంది. టీజర్లో ప్రభాస్ ఓ చేతితో గన్స్...మరో చేత్తో కత్తులతో విలన్స్‌తో ఫైట్ చేస్తున్న సీన్ సూపర్. పిడికిలి బిగించి ప్రభాస్ నిల్చున్న సమయంలో ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ రావడం పక్కా.
టీజర్లో ప్రభాస్ హీరోయిజాన్ని ఓ రేంజ్ లో చూపించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అచ్చం కేజీఎఫ్ తరహాలోనే హీరో ప్రభాస్ క్యారక్టర్‌ను ప్రశాంత్ నీల్ పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు అర్థమవుతోంది. సలార్ సినిమా రెండు పార్ట్‌లుగా రానుంది. పార్ట్ 1- సీజ్‌ఫైర్ అంటూ టీజర్ చివర్లో మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ టీజర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్స్ కేక. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది.
ప్రస్తుతం సలార్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా సలార్ నుంచి ఫస్ట్ లుక్స్ తప్ప మరొక అప్డేట్ రాలేదు. తాజాగా సలార్ సినిమా టీజర్ రిలీజ్ తో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. అంచనాలకు తగినట్లే టీజర్ ఉందని..బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం పక్కా అంటున్నారు. సలార్ టీజర్ అన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.
సలార్ మూవీని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.