
ఇండియా లెవల్లో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరో ఎవరైనా ఉన్నారంటే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. ఈ మధ్య ఆయన ఉన్నంత బిజీగా మరే స్టార్ హీరో లేడని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. వరుస సినిమా షూటింగుల్లో పాల్గొంటూ బిజీగా బిజీగా గడిపేస్తున్నాడు. ఓపక్క ప్రశాంత్ నీల్ తో సాలార్, మరోపక్క ఆదిపురుష్ ప్రమోషన్స్, మధ్యలో మారుతి సినిమా. ఇవన్నీ చాలవన్నట్టు బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ సినిమా ని కూడా ఒక చేశాడు.
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించనున్నారు. పఠాన్ రిలీజ్ సమయంలోనే.. అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. ఈ వార్త అప్పట్లో ట్రెండ్ అయ్యింది కూడా. ఈ సినిమా కోసం సిద్దార్థ్ కి 75 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారట మేకర్స్. ప్రభాస్ సలార్ షూటింగ్ కంప్లీట్ చేయగానే.. ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్దామనుకున్నారు మేకర్స్. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు ఆగిపయిందట. కారణం... ప్రస్తుతం సిద్దార్థ్ వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఫైటర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో నెలల తరబడి సమయం పట్టే అవకాశం ఉంది.
మరోపక్క.. టైగర్ వర్సెస్ పఠాన్ స్క్రిప్ట్ కోసం కూడా ఏడాదికి పైగా సమయం పట్టేలా ఉంది. దీంతో.. ప్రభాస్ సినిమా కోసం కనీసం కథ కూడా రెడీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు డైరెక్టర్. ఇక చేసేదేమి లేక అడ్వాన్స్ కూడా తిరిగిచ్చేశాడట సిద్దార్థ్. భవిష్యత్తులో మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ చేసుకునేలా ప్లాన్ చేసుకొని డ్రాప్ అయ్యారని తెలుస్తోంది. మొత్తానికి ఓ క్రేజీ ప్రాజెక్టు మొదలవకుండానే ఆగిపోయింది.