సెప్టెంబర్ నుంచి స్పిరిట్ షూట్ స్టార్ట్..

సెప్టెంబర్ నుంచి స్పిరిట్ షూట్ స్టార్ట్..

వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా  ఉన్నాడు  ప్రభాస్.  ప్రస్తుతం మారుతి తీస్తున్న ‘రాజా సాబ్’తో పాటు హను రాఘవపూడి రూపొందిస్తున్న చిత్రాన్ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.  వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో  ప్రభాస్ నటించాల్సి ఉంది.  ‘స్పిరిట్’ టైటిల్‌తో  తెరకెక్కనున్న  ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను  అందించారు మేకర్స్. సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు టీమ్ తెలియజేసింది.  

యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో  గ్లోబల్ మూవీగా దీన్ని రూపొందించనున్నట్టు, దాదాపు తొమ్మిది భాషల్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఇంటర్నేషనల్ స్కేల్,  యూనివర్సల్ అప్పీల్‌తో  రానున్న  ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అలరించబోతోందని చెబుతూ అంచనాలు పెంచారు. ఇందులో  ప్రభాస్ డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది. త్రిప్తి డిమ్రి  హీరోయిన్‌. టీ సిరీస్ భూషణ్ కుమార్‌‌తో  కలిసి ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించనున్న ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.