వరల్డ్ కప్ మ్యాచ్లో సలార్.. గట్టిగా ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్

వరల్డ్ కప్ మ్యాచ్లో సలార్.. గట్టిగా ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ వరల్డ్ కప్(Cricket world cup) ఫీవర్ నడుస్తోంది. ఈ ఇయర్ ఈ మెగా క్రికెట్ సంగ్రామం ఇండియాలో జరుగుతుండటంతో ఇండియన్ స్టార్ అందరు లైవ్ లో మ్యాచ్ లు చూడటానికి స్టేడియానికి వెళ్తున్నారు. అంతేకాదు.. ఈ క్రికెట్ ఫీవర్ తో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలను కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు మేకర్స్. ఆ రేంజ్ లో ముందుకు సాగుతోంది ఈ మెగా టోర్నీ. ఇక ఇండియన్ టీమ్ కూడా వీర లెవల్లో పర్ఫార్మెన్స్ ఇస్తుండటం, వరుస మ్యాచుల్లో గెలుస్తుండటంతో ఆ ఫీవర్ కాస్త నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. 

Also Read :- కావాలనే నెగిటివ్ చేస్తున్నారు

అయితే ఈ క్రికెట్ మ్యానియాను క్యాష్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట సలార్(Salaar) మేకర్స్. ఇందుకోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. నార్మల్ ఆడియన్స్ కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. 

ఇక రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు మేకర్స్. ఇందులో భాగాంగానే..  వన్డే వరల్డ్ కప్​-2023 గ్రూప్ స్టేజ్ లో​ టీమిండియా(Team india), నెదర్లాండ్స్(Netherlands) మధ్య జరుగనున్న ఆఖరి మ్యాచ్ కోసం ప్రభాస్ రానున్నాడట. సలార్ లాంటి హైపున్న సినిమాకు ఈ రేంజ్ ప్రమోషన్స్ కావాలని డిసైడ్ అయ్యాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ సలార్ ప్రమోషన్స్​ను ఇక్కడి నుండే మొదలుపెట్టనున్నారని టాక్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.