
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లో డైరెక్టర్ మారుతి(Maruthi)తో చేస్తున్న సినిమా ఒకటి. అనౌన్స్మెంట్ తోనే ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేసింది ఈ సినిమా. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ ఐనా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుండి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.
ALSO READ : ఆదిపురుష్ పై విమర్శలు.. స్పందించిన కృతి తల్లి
ప్రభాస్-మారుతి కాంబోలో వస్తున్న ఈ సినిమాకు "రాజా డీలక్స్(Raja Delux)" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారనే వార్తలు బలంగా విపించాయి. అయితే తాజగా ఈ సినిమాకు మరో రెండు టైటిల్స్ ను పరిశీలిస్తన్నారట మేకర్స్. అందులో ఒకటి రాయల్ కాగా, మరొకటి అంబాసిడర్. ఈ రెండు టైటిల్స్ లో ఒకటి ఈ సినిమాకు ఫిక్స్ చేయనున్నారని సమాచారం.
ALSO READ : ఆదిపురుష్ బంపర్ ఆఫర్.. సగం ధరకే సినిమా టికెట్లు
అయితే.. ఈ టైటిల్స్ ను లీక్ చేయడంలో కూడా ఒక స్టాటజీ ఉందట. అదేంటంటే.. ఈ రెండు టైటిల్స్ లో దేనికి మంచి రెస్పాన్స్ వస్తుందో అనేది తెలుసుకోవడానికే ఈ ప్లాన్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హారర్ అండ్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ సినిమాలో రీద్దీ కుమార్ (Riddi kumar), మాళవిక మోహన్ (Malavika Mohan), నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్స్ నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్(Sanjay dat) మరో కీ రోల్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే యాభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.