Norway Chess 2026: వరల్డ్ ఛాంపియన్ గుకేష్‌కే షాకిచ్చిన ప్రజ్ఞానంద.. టైటిల్ రేస్ చూస్తే మైండ్ బ్లాకే!

Norway Chess 2026: వరల్డ్ ఛాంపియన్ గుకేష్‌కే షాకిచ్చిన ప్రజ్ఞానంద.. టైటిల్ రేస్ చూస్తే మైండ్ బ్లాకే!

Norway Chess 2026: ఓస్లో వేదికగా జరుగుతున్న నార్వే చెస్ 2026 టోర్నమెంట్ క్లైమాక్స్‌కి చేరింది. 9వ రౌండ్ ముగిసేసరికి టేబుల్ మొత్తం తలకిందులైపోయింది. వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సన్‌కు వెస్లీ సో షాకిస్తే, మన ఇండియన్ ప్లేయర్ ప్రజ్ఞానంద.. వరల్డ్ ఛాంపియన్ గుకేష్‌ను పడగొట్టి టోర్నమెంట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిండు. ఇవాళ (2026, జూన్ 6న) జరిగే ఫైనల్ రౌండ్ కంటే ముందు టైటిల్ రేస్ పీక్స్‌కి చేరింది.

గుకేష్‌ను దెబ్బకొట్టిన ప్రజ్ఞానంద: 
ఈ రౌండ్‌లో అసలైన హైలైట్ మ్యాచ్ మన ఇండియన్స్ మధ్యనే నడిచింది. నల్ల ముక్కలతో (Black Pieces) బరిలోకి దిగిన ప్రజ్ఞానంద రమేష్‌బాబు, వరల్డ్ ఛాంపియన్ గుకేష్ దొమ్మరాజును క్లాసికల్ గేమ్‌లోనే మట్టికరిపించిండు. మిడిల్ గేమ్‌లో గుకేష్‌పై విపరీతమైన ప్రెజర్ పెంచిన ప్రజ్ఞానంద, ఎక్కడా తడబడకుండా మ్యాచ్‌ను గెలిచేశాడు. ఈ విజయంతో డైరెక్ట్‌గా 3 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ప్రజ్ఞానంద, మొత్తం 15 పాయింట్లతో టేబుల్ టాపర్ వెస్లీ సో కంటే కేవలం హాఫ్ పాయింట్ (0.5) వెనుకబడి రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఫైనల్ రౌండ్‌లో మనోడు గెలిస్తే టైటిల్ కొట్టే అవకాశం గట్టిగా ఉంది. 

కార్ల్‌సన్‌కు వెస్లీ సో మైండ్ బ్లాక్ షాక్: 
మరో పక్క, టోర్నమెంట్ లీడర్ వెస్లీ సో, వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సన్ మధ్య మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను రేపింది. మొదట క్లాసికల్ గేమ్ డ్రాగా ముగిసినప్పటికీ, ఆ తర్వాత జరిగిన 'అర్మగెడాన్' (Armageddon) మ్యాచ్‌లో వెస్లీ సో విజయం సాధించాడు. దీంతో ఎక్స్‌ట్రా పాయింట్లు కొట్టేసి 15.5 పాయింట్లతో టేబుల్ టాప్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అటు అలీరెజా ఫిరూజా కూడా రేసులో ఉన్నాడు. విన్సెంట్ కీమర్‌తో క్లాసికల్ గేమ్ డ్రా చేసుకున్న అలీరెజా, అర్మగెడాన్‌లో గెలిచి 14.5 పాయింట్లతో థర్డ్ ప్లేస్‌లో నిలిచాడు. 

రౌండ్ 9 తర్వాత పాయింట్ల పట్టిక: 
* వెస్లీ సో – 15.5 పాయింట్లు
* ప్రజ్ఞానంద – 15.0 పాయింట్లు
* అలీరెజా ఫిరూజా – 14.5 పాయింట్లు