
వార్సా (పోలెండ్): ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద (20.5 పాయింట్లు).. సూపర్‌బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీలో మూడో ప్లేస్‌లో నిలిచాడు. గురువారం జరిగిన ఫైనల్ రౌండ్‌లో ప్రజ్ఞా తొలి ఐదు గేమ్‌ల్లో ఒక్క పాయింట్ మాత్రమే సాధించాడు. కానీ సెకండాఫ్‌లో ఇండియన్ మాస్టర్ వరుసగా డుడా, తపలోవ్, అరవింద్, గావ్రిలెస్క్‌లను ఓడించాడు. దీంతో తొమ్మిది గేమ్‌ల్లో ఐదు పాయింట్లను సాధించడంతో మూడో ప్లేస్ ఖాయమైంది.
వ్లాదిమిర్ ఫడోసీవ్ (స్లోవేనియా) 26.5 పాయింట్లతో టైటిల్‌ను గెలుచుకోగా, మ్యాక్సీమ్ వాచిర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్) 21.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇండియాకు చెందిన అరవింద్ చిదంబరం 17 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ నెల 7 నుంచి మొదలయ్యే క్లాసికల్ ఈవెంట్‌లో ప్రజ్ఞానందతో పాటు గుకేశ్ బరిలోకి దిగనున్నాడు. అమెరికన్ ద్వయం కరువానా, వెస్లీ సో, నోడిర్బెక్ అబ్దుసత్తారోవ్ (ఉజ్బెకిస్తాన్) పోటీలో ఉన్నారు. రొమేనియా రాజధాని బుకారెస్ట్‌లో ఈ టోర్నీ జరగనుంది.