నార్వే చెస్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో ప్రజ్ఞానంద బోణీ

నార్వే చెస్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో ప్రజ్ఞానంద బోణీ

స్టావెంజర్‌‌‌‌‌‌‌‌ (నార్వే): ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌ గ్రాండ్ మాస్టర్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌. ప్రజ్ఞానంద.. నార్వే చెస్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో బోణీ చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో ప్రజ్ఞానంద 38 ఎత్తుల వద్ద ఫిరౌజ అలీరెజా (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌)ను ఓడించాడు. ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌పై నెగ్గడం ప్రజ్ఞానందకు ఇదే తొలిసారి. ఈ రౌండ్‌‌‌‌‌‌‌‌ తర్వాత ప్రజ్ఞానంద ఒకటిన్నర పాయింట్లతో క్లార్‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌, నకమురాతో కలిసి టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్నాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ సెక్షన్‌‌‌‌‌‌‌‌లో కోనేరు హంపి (1.5).. క్రామ్లింగ్‌‌‌‌‌‌‌‌ (స్వీడన్‌‌‌‌‌‌‌‌)పై గెలవగా, ఆర్‌‌‌‌‌‌‌‌. వైశాలి (1).. వెన్‌‌‌‌‌‌‌‌జున్‌‌‌‌‌‌‌‌ జు (చైనా) చేతిలో ఓడింది.