మేనిఫెస్టోను విడుదల చేసిన ప్రజాసంఘాలు

మేనిఫెస్టోను విడుదల చేసిన ప్రజాసంఘాలు

హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రజా సంఘాలు మేనిఫెస్టో విడుదల చేశాయి.  ఆదివాసీలను రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదన్నారు వక్తలు.  ఏళ్లుగా ఉన్న పోడు భూముల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. తాము సూచించిన 30 ప్రజా సమస్యలను రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టాలని సూచించారు. ప్రజాస్వామిక తెలంగాణ  కోసం మేనిఫెస్టో తీసుకొచ్చామన్నారు వ్యక్తలు. కార్యక్రమంలో టీజేఎస్ అధ్యక్షులు ప్రొ.కోదండరాం, పాశం యాదగిరి, నల్సార్ ప్రొఫెసర్ భూమి సునీల్ కుమార్, తెలంగాణ సమాఖ్య ఫౌండర్ , సుప్రీంకోర్టు అడ్వకేట్ నీరుప్ రెడ్డి పాల్గొన్నారు.

ఐదు సంవత్సరాలు కృషి చేసిన కృషి ఫలితమే ఈ మేనిఫేస్టో అన్నారు కోదండరాం.  తెలంగాణలో నిరంకుశపాలన  నడుస్తోందన్నారు.  ఈ దోపిడిని అరికట్టాలన్నారు. తెలంగాణ అప్పుల పుట్టగా తయారయ్యిందన్నారు.  ధరణి వచ్చాక అనేక సమస్యలు వచ్చాయని. వాటి పరిష్కార మార్గం చూడాలని చెప్పారు.  ఆత్మ గౌరవంతో తెలంగాణలో బతకాలంటే విద్య,వైద్యం ఉచితంగా అందించాలన్నారు.