తెలంగాణ ప్రజాదర్బార్‌ పేరు మార్పు

తెలంగాణ ప్రజాదర్బార్‌ పేరు మార్పు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రజాదర్బార్‌ పేరును ప్రజావాణిగా మారుస్తూ  నిర్ణయం తీసుకుంది.  ప్రతి మంగళవారం, శుక్రవారం రోజున ప్రజావాణి నిర్వహించనున్నట్లు వెల్లడించింది.   ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో రెండు రోజులు ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం వంటి గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించింది.   

ఉదయం 10 గంటల లోపు జ్యోతి రావు పూలే  ప్రజా భవన్ కు చేరుకున్న వారికి అవకాశం ఉంటుంది. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటు  చేయాలని,ప్రజల సౌకర్యార్థం తీగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

డిసెంబర్ 8న హైదరాబాద్ లోని  మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌లో  ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని  సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.  ఈ క్రమంలో ప్రజలు వివిధ సమస్యలపై సీఎంకు వినతి పత్రాలు సమర్పించారు. ఇందులో ఎక్కువగా డబుల్ బెడ్రూమ్  ఇళ్లు, పింఛన్ సంబంధించిన సమస్యలపై వినతిపత్రాలు వచ్చాయి.  

.ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి సోమవారం వరకు మొత్తం 4,471 వరకు వినతులు పత్రాలు రాగా ఇవాళ  నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో 1,143 వినతి పత్రాలు అందాయని అధికారులు వెల్లడించారు.