సీఎం రేవంత్రెడ్డి ప్రజాదర్బార్కు విశేష స్పందన

సీఎం రేవంత్రెడ్డి ప్రజాదర్బార్కు విశేష స్పందన

తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించిన ప్రజాదర్బార్కు విశేష స్పందన లభిస్తోంది. డిసెంబర్ 8 నుంచి మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్ లో ప్రారంభమైన ప్రజాదర్బార్ కు వేల సంఖ్యలో వినతులు వస్తున్నాయి. ప్రజలు తమ సమస్యలపై పెద్ద ఎత్తున వినతి పత్రాలను సమర్పించేందుకు ప్రజాభవన్ కు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ ప్రొగ్రాం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు 4వేల 471 వినతి పత్రాలు అందాయి. అందులో ఎక్కువ శాతం డబుల్ బెడ్ రూం, పెన్షన్లకు సంబంధించిన వినతి పత్రాలు ఉన్నాయి. సోమవారం (డిసెంబర్11) నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 1,143 వినతి పత్రాలు అందినట్లు ప్రజాభవన్ వర్గాలు తెలిపాయి. 

తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి ..గతంలో ప్రగతిభవన్ గా ఉన్న సీఎం అధికారిక నివాసం పేరును మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ గా మార్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజునుంచే ప్రజాభవన్ లో ప్రజలనుంచి వినతులను స్వీకరించారు ముఖ్యమంత్రి. అయితే గత ప్రభుత్వం హయాంలో  ప్రగతి భవన్ ఆవరణలోకి కూడా ప్రజలు వెళ్లలేక పోయారని..తమ ప్రభుత్వంలో ప్రజాదర్భార్ ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం తలుపులు తెరిచి ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.