ప్రజావాణికి వచ్చిన అర్జీలను తొందరగా పరిష్కరించాలి : మధుసూదన్

ప్రజావాణికి వచ్చిన అర్జీలను తొందరగా పరిష్కరించాలి : మధుసూదన్

హైదరాబాద్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన అర్జీలను తొందరగా పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి ఆయన హాజరై జనాల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 398 అర్జీలు వచ్చాయన్నారు.

రంగారెడ్డి కలెక్టరేట్​లో..

కొంగరకలాన్​లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి 498 అర్జీలు వచ్చినట్లు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి తెలిపారు. ప్రజావాణికి వచ్చిన అర్జీలను పెండింగ్​లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు సూచించారు.